ప్రశాంత్ వర్మ కెరీర్ బ్రేక్‌పై బ్రేక్ – ‘జై హనుమాన్’ మిగిలిందొక్కటే!

Prasanth Varma cinematic universe

ప్రముఖ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కెరీర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా, రైటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. అనంతరం ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ సినిమాలతో టాలెంట్ చూపించారు. కానీ ‘హనుమాన్’ చిత్రం ప్రశాంత్‌కు బ్రేక్ తీయనిది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.350 కోట్లు రాబట్టి భారీ విజయం సాధించింది. దీంతో ఇండస్ట్రీలో ప్రశాంత్‌కు స్టార్ డైరెక్టర్ హోదా లభించింది.

అయితే ‘హనుమాన్’ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం ఇప్పుడు ప్రశాంత్ ఎదుట పెద్ద సవాలుగా మారింది. రణ్‌వీర్ సింగ్‌తో చేసే ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోగా, కల్యాణ్ దాసరి హీరోగా రూపొందించాల్సిన సూపర్‌మ్యాన్ చిత్రం కూడా ప్రీ ప్రొడక్షన్ వరకు వెళ్లి నిలిచిపోయింది. అలాగే నందమూరి మోక్షజ్ఞను లాంచ్ చేసే భారీ చిత్రం కూడా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇలా ఒక్కొక్కటిగా హైప్ ఉన్న ప్రాజెక్టులు క్యాన్సిల్ అవుతూ రావడం ప్రశాంత్ వెనకడుగు వేసినట్టు చర్చకు దారి తీసింది.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’. హనుమాన్ సినిమాతో క్రేజ్‌ను పొందిన ఆయన, తన సొంతంగా నిర్మించనున్న ‘సినిమాటిక్ యూనివర్స్‌’కు ఇది కీలకంగా మారనుంది. అయితే ఒకేసారి మల్టీపుల్ ప్రాజెక్ట్స్‌పై దృష్టిపెట్టడమే ఆయన ప్లానింగ్ లో లోపం తెచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. ‘జై హనుమాన్’ అయినా అనుకున్న టైమ్‌కూ, స్థాయికీ వస్తుందా అనే ఉత్కంఠ ఇండస్ట్రీలో నెలకొంది.

Read More

One thought on “ప్రశాంత్ వర్మ కెరీర్ బ్రేక్‌పై బ్రేక్ – ‘జై హనుమాన్’ మిగిలిందొక్కటే!

Comments are closed.