ప్రకాశం జిల్లా పోలీసులపై లాకప్ మృతి ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఏప్రిల్లో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితులపై అధికపీడనానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపార విభేదాల నేపథ్యంలో జరిగిన ఈ హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో, పోలీసులు కొన్ని రోజులు నుంచి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
తాజాగా ఓ అనుమానితుడు పోలీసుల హింసను తట్టుకోలేక మృతిచెందినట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని శిక్షణ కేంద్రం ప్రాంగణంలో జరిగిందని సమాచారం. మృతుడి కుటుంబాన్ని విషయం బయటపెట్టవద్దని హెచ్చరిస్తూ, ఇంటి వద్ద నిఘా పెట్టినట్లు సమాచారం. అంతేగాక, అంత్యక్రియలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసుల తీరుపై మానవహక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం దీనిపై సీరియస్గా స్పందించి విచారణకు ఆదేశించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read More : ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి స్పష్టం

One thought on “ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ అనుమానం…”
Comments are closed.