తమిళ స్టార్ హీరో సూర్య సరసన “రెట్రో” చిత్రంలో పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించింది. కొంత గ్యాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీకి మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. మే 1న “రెట్రో” థియేటర్లలో విడుదల కానుంది. ఇక తర్వాత దళపతి విజయ్ సరసన “జననాయకన్” సినిమాలో కూడా పూజా నటించనుంది.
ఈ సందర్భంగా పూజా హెగ్డే తన అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చింది. లేటెస్ట్ ఎల్లే కవర్ ఫోటోషూట్‌లో పూజా విభిన్న డిజైనర్ దుస్తులతో చిలింగ్ లుక్స్‌ను ప్రదర్శించి అందర్నీ మెప్పించింది. రాజస్థానీ కళంకార్ నుంచి జైపూర్ ట్రెడిషనల్ డిజైన్స్ వరకు వివిధ స్టైలిష్ దుస్తుల్లో పూజా తన గ్లామర్‌ను మరోసారి హైలైట్ చేసింది.

ప్రత్యేకంగా బ్లాక్ కలర్ డిజైనర్ ఫ్రాక్‌లో పూజా సొగసులు అభిమానులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ ఎల్లే ఫోటోషూట్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయి, నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పూజా తన స్టైలిష్ లుక్స్‌తో ట్రెడిషనల్ టచ్‌ను మిక్స్ చేసి మరోసారి ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచింది.

తెలుగులో “అల వైకుంఠపురములో” వంటి సూపర్ హిట్ తర్వాత “ఆచార్య”లో కనిపించిన పూజా, కొన్ని కారణాలతో టాలీవుడ్‌కు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సౌత్‌లో రీ-ఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో ఉంది. త్వరలోనే మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుందన్న అంచనాలు నెలకొన్నాయి.

One thought on “‘రెట్రో’తో సౌత్‌లో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే”
Comments are closed.