పెద్దపల్లి జిల్లా కునారం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులు జరుగుతుండగా, ఒక గడ్డర్ సపోర్ట్ రైల్వే ట్రాక్‌పై విరిగిపడింది. ఈ ఘటన కారణంగా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు రాఘవపూర్ రైల్వే స్టేషన్లో నాలుగు గంటలుగా నిలిచిపోయింది. ఈ విఘాతం వల్ల పెద్దపల్లి మార్గంలో రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తం అయ్యాయి. రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర పరిస్థితి ఏర్పడటంతో అధికారులు అన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి నియంత్రణలోకి రావడానికి మరో రెండు గంటల సమయం పడవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
ఇక నాలుగు గంటలుగా ట్రైన్లోనే ఉన్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. తాగునీరు, ఆహారం వంటి సదుపాయాల లేమితో పాటు ఎటూ కదలనలేని పరిస్థితి ప్రయాణికులను కష్టాల్లోకి నెట్టింది. కొన్ని కుటుంబాలు చిన్నారులతో సహా ట్రైన్‌లో ఉండడంతో వారి ఇబ్బందులు మరింత తీవ్రంగా మారాయి. రైల్వే అధికారులు, స్థానిక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్లస్టర్‌ను తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలోనే ట్రాక్‌ను మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత దృష్టిలో ఉంచుకుని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
Read More : phone tapping case : ఏబీఎన్ ఆర్కే, నోటీసులు

One thought on “పెద్దపల్లిలో రైల్వే ట్రాక్‌పై విరిగిపడిన క్లస్టర్”
Comments are closed.