రాఖీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి అన్నది కేవలం ఒక దారమేకాదని, అది అక్కచెల్లెళ్ల-అన్నదమ్ముల మధ్య ఉన్న స్నేహం, ప్రేమ, అనుబంధాలకు ప్రతీక అని ఆయన అన్నారు.

మహిళల సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’, ‘దీపం-2’ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే, ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు ప్రకటించారు.

ప్రజా జీవితంలో తాను చేసే ప్రతి అడుగులోనూ మహిళలకు అండగా నిలుస్తానని, వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Read More : చెల్లెలి కోసం గుడి కట్టిన అన్నయ్య

One thought on “రాఖీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Comments are closed.