పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్నారు. పీకే పెండింగ్ చిత్రాలను పూర్తిచేయాలనే సంకల్పంతో వీరమల్లు, ఓజీ చిత్రాలను త్వరగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తున్నారు. ఈ చిత్రాల విడుదల తేదీలకు సంబంధించి కలిపించిన ప్రణాళికలు, హరిహర వీరమల్లు మే 9న రిలీజ్ అవుతుంది అని చెబుతున్నారు. ఓజీ చిత్రం సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక, పవన్ కళ్యాణ్ అతి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రం గురించి కూడా ఆసక్తికరమైన న్యూస్ వచ్చింది. ఈ చిత్రాన్ని చాలా కాలంగా నిలిపివేసిన పవన్ ఇప్పుడు జులైలో షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ చిత్రం కోసం ఇప్పటికే హరీష్ శంకర్‌తో ఒక షెడ్యూల్ జరిపి, ఆ తరువాత ఆ ప్రాజెక్టు నిలిపివేయడం జరిగింది.
ఇప్పుడు, “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా గురించి కొత్తగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పవన్ జులైలో ఓజీ షూటింగ్ పూర్తి చేసి “భగత్ సింగ్” చిత్రానికి డేట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం హరీష్ శంకర్ చాలా ఆశక్తిగా ఎదురుచూస్తున్నాడు.
మరి, పవన్ వస్తే, హరీష్ ఈ చిత్రం ద్వారా హిట్స్ సాధిస్తాడని భావిస్తున్నారు. గతంలో కొన్ని ప్లాప్ చిత్రాలు చేసిన హరీష్‌కు పవన్‌తో చేసిన ప్రాజెక్టు మరింత విజయం సాధించగలిగినట్టు కనిపిస్తోంది.

One thought on “పవన్ కళ్యాణ్ “భగత్ సింగ్” షూటింగ్ జులై నుంచి ప్రారంభం!”
Comments are closed.