భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ రెండో క్షిపణి పరీక్ష..

భారత్‌తో విభేదాలు పెరుగుతున్న తరుణంలో పాకిస్థాన్ మళ్లీ క్షిపణి పరీక్ష చేపట్టింది. సుమారు 120 కిలోమీటర్ల పరిధి కలిగిన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ మీడియా విభాగం ప్రకటించింది.

ఈ పరీక్ష ప్రధానంగా తమ సైనిక దళాల కార్యాచరణ సామర్థ్యం, సాంకేతిక పరామితులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయో తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించినట్లు వెల్లడించింది. అలాగే, ఆయుధ వ్యవస్థల పనితీరును సమీక్షించడానికి, అవసరమైన సాంకేతిక అంశాలను ధృవీకరించేందుకు కూడా ఈ ప్రయోగం ఉపయోగపడిందని పేర్కొన్నారు.

అయితే ఈ పరీక్ష ఎప్పుడు, ఎక్కడ జరిగింది?, ఏ రకమైన క్షిపణి ప్రయోగించబడింది? వంటి వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కేవలం సైనిక శక్తిని పునర్మూల్యాంకనం చేయడమే లక్ష్యంగా ఈ పరీక్ష నిర్వహించినట్లు మాత్రమే పాకిస్థాన్ పేర్కొంది.

ఇదే తరహాలో ఇటీవల పాక్ మొదటి క్షిపణి పరీక్షను కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, రెండో ప్రయోగం చేపట్టిన నేపథ్యంలో భారత్‌తో ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More : భారత్ వ్యూహాత్మక అడుగు : పాకిస్థాన్‌కు షాక్

One thought on “భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ రెండో క్షిపణి పరీక్ష..

Comments are closed.