పాకిస్థాన్‌పై భారత్ ఎన్నాళ్లుగానో వ్యక్తం చేస్తున్న ఆందోళనలు మరోసారి నిజమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ పొందేందుకు విధించిన షరతుల్లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైంది. నిర్ణయించిన ఐదు కీలక లక్ష్యాలలో మూడింటిని సాధించలేకపోయింది. పాకిస్థాన్ రుణాలు తీసుకోవడంలో చురుకుగా ఉంటూ, వాటి అమలులో విఫలమవుతోందన్న భారత్ వాదనలకు ఈ పరిణామం మరింత బలం చేకూర్చింది. పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్‌బీఆర్) రెండు ప్రధాన ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేకపోయింది. మొత్తం 12.3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సేకరించడంలో విఫలమైంది. అలాగే, రిటైలర్లపై పన్ను విధించేందుకు ప్రవేశపెట్టిన ‘తాజిర్ దోస్త్’ పథకం ద్వారా 50 బిలియన్ రూపాయలు సమీకరించాలన్న లక్ష్యం పూర్తిగా విఫలమైంది. దీనిపై ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక స్పష్టమైన నివేదిక ప్రచురించింది. అంతేకాక, గత ఆర్థిక సంవత్సరంలో అధిక వ్యయాల కారణంగా రాష్ట్రాలు 1.2 లక్షల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో కూడా విఫలమయ్యాయని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి లభించే నిధులను పాకిస్థాన్ సైనిక అవసరాలకు, సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు వాడే అవకాశం ఉందని భారత్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. గత ఐఎంఎఫ్ సమావేశంలో భారత ప్రతినిధి పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ, “ప్రపంచ ఆర్థిక సంస్థలు అనుసరించే విధానాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది” అన్నారు.
పాకిస్థాన్ పదే పదే ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకుంటూ, షరతులను అమలు చేయడంలో విఫలమవుతోందని భారత్ విమర్శించింది. గత ప్యాకేజీలు ఫలితాలిచ్చి ఉంటే, మళ్లీ బెయిలౌట్ కోసం వెళ్లే పరిస్థితి ఉండేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై సైన్యం పట్టు కొనసాగుతుండటమే విధానపరమైన లోపాలకు కారణమని, సంస్కరణలు వెనక్కి వెళ్తున్నాయని భారత్ పేర్కొంది.
ప్రస్తుతం పౌర ప్రభుత్వం ఉన్నప్పటికీ, స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌లో సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేసింది. రాజకీయ కారణాల వల్లే పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ పదేపదే రుణాలు ఇస్తోందనే అభిప్రాయం ఉందని భారత్ విశ్లేషించింది.
Read More : అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

One thought on “పాకిస్థాన్ ఐఎంఎఫ్ షరతుల్లో విఫలం – భారత్ వాదనలకు బలం”
Comments are closed.