పాకిస్థాన్ ప్రపంచంలో రెండవ అత్యధిక తీవ్రవాద ప్రభావిత దేశంగా ర్యాంక్

Pakistan

పాకిస్థాన్‌లో తీవ్రవాద కార్యకలాపాలు మరింత పెరిగినట్లు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో పాకిస్థాన్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. 2023లో పాకిస్థాన్‌లో 517 తీవ్రవాద దాడులు జరిగాయని, 2024 నాటికి ఈ సంఖ్య గణనీయంగా పెరిగి 1,099కు చేరినట్టు నివేదిక పేర్కొంది.

దేశంలో తీవ్రవాద సంఘటనలు భారీగా పెరగడం, ప్రభుత్వ విధానాలు తీవ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్నాయన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ తన భూభాగంలో తీవ్రవాద సంస్థలు ఆశ్రయం పొందడం లేదని ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఇంత తీవ్రత పెరిగిన నేపథ్యంలో పాకిస్థాన్‌ను సందర్శించడం సురక్షితమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పెరుగుతున్న ఉగ్రదాడులు, భద్రతా లోపాల కారణంగా పాకిస్థాన్ విదేశీయులకు, పర్యాటకులకు సురక్షితమైన గమ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More

One thought on “పాకిస్థాన్ ప్రపంచంలో రెండవ అత్యధిక తీవ్రవాద ప్రభావిత దేశంగా ర్యాంక్

Comments are closed.