పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ రెజర్లు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు.
కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్‌తో పాటు భారీగా ఫైరింగ్‌కు పాల్పడుతున్నాయి. నివాస ప్రాంతాలే లక్ష్యంగా జరుగుతున్న ఈ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
బుధవారం అర్థరాత్రి పాక్ జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ వీరమరణం పొందారు. ఆయన 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందినవారని వైట్ నైట్ కోర్ వెల్లడించింది. గత రెండు వారాలుగా పాక్ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని సైనిక అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటివరకు పాక్ దాడుల్లో 12 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోగా, 57 మంది వరకు గాయపడ్డారు. సరిహద్దు పరిస్థితులపై భారత రక్షణ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, బలగాలను అప్రమత్తంగా ఉంచింది.
Read More : దేశవ్యాప్తంగా 300 విమాన సర్వీసులు రద్దు

One thought on “సరిహద్దుల్లో కాల్పుల కల్లోలం”
Comments are closed.