ఎన్టీఆర్ నెక్ట్స్ లైన్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్?

jr ntr and nelson dilipkumar

ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన క్రేజ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’లో నటిస్తూనే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ మరిన్ని కొత్త కాంబినేషన్‌ల్లో సినిమాలు చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

తాజాగా కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ‘డాక్టర్’, ‘జైలర్’ వంటి సూపర్‌హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్, ఎన్టీఆర్ కోసం ఓ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ కథలో యాక్షన్, కామెడీ సమపాళ్లలో ఉంటాయని, ‘జైలర్’ తరహాలోనే వినోదాన్ని మిక్స్ చేసే విధంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా టైటిల్‌గా ‘రాక్ (ROCK)’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా, 2026లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

Read More

One thought on “ఎన్టీఆర్ నెక్ట్స్ లైన్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్?

Comments are closed.