నిమ్స్‌లో టాయిలెట్ పైపులో పసిపాప మృతదేహం

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఓపీ బ్లాక్‌లో శుభ్రత పనులు నిర్వహిస్తున్న సమయంలో టాయిలెట్ పైపుల్లో నవజాత శిశువు మృతదేహం కనిపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు.
అప్పుడే పుట్టిన పసిపాప మృతదేహంగా ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని ఎవరు అక్కడ వదిలారనే కోణంలో నిమ్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. శిశువు తల్లి ఎవరు? ఎలా ఈ పరిస్థితి ఏర్పడింది? అన్న దానిపై ఆసుపత్రి సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More : ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

One thought on “నిమ్స్‌లో టాయిలెట్ పైపులో పసిపాప మృతదేహం

Comments are closed.