శ్రీజ వివాహానికి బాలయ్య హాజరు ?

ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహం ఈ నెల 24న పాలకొల్లులో జరుగనుంది. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ప్రముఖులను కలుసుకొని ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు.

బుధవారం ఆయన హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌కు వెళ్లి, నటసింహా నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరుతూ శుభలేఖను అందజేశారు. ఆహ్వానం స్వీకరించిన బాలకృష్ణ, తప్పకుండా పెళ్లికి వస్తానని హామీ ఇచ్చారు. అయితే సరదాగా స్పందిస్తూ, “వస్తాను.. కానీ ఎలా వస్తానో చెప్పను” అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడి వాతావరణం ఆనందంగా మారింది.

అదే రోజు మంత్రి రామానాయుడు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనును కూడా కలసి వివాహానికి ఆహ్వానించారు. బాలయ్యతో జరిగిన సరదా సంభాషణ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

Read More : దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు పొడిగింపు.

One thought on “శ్రీజ వివాహానికి బాలయ్య హాజరు ?

Comments are closed.