యెమెన్‌లో నిమిష ప్రియ విడుదల కోసం కేఏ పాల్ విజ్ఞప్తి

యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చురుకైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె విడుదల కోసం నిమిష ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్‌కు వెళ్లారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ విషయమై సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను పంచుకున్నారు.

ఆ వీడియోలో నిమిష ప్రియ భర్త థామస్, కుమార్తె మిషెల్ యెమెన్ ప్రభుత్వాన్ని తన భార్యను విడుదల చేయాలని వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. వారితో పాటు కేఏ పాల్ కూడా ఉన్నారు. తన భార్య మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసినందుకు యెమెన్ హుతీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ థామస్ భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ, ద్వేషం కంటే ప్రేమ శక్తివంతమైందని పేర్కొన్నారు. అనేక ఏళ్లుగా అంతర్యుద్ధంలో చిక్కుకున్న యెమెన్‌లో శాశ్వత శాంతి కోసం మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నిమిష ప్రియను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని యెమెన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read More : కంబోడియా–థాయిలాండ్ సరిహద్దు ఘర్షణలు తీవ్రరూపం

One thought on “యెమెన్‌లో నిమిష ప్రియ విడుదల కోసం కేఏ పాల్ విజ్ఞప్తి

Comments are closed.