ధనుష్ తో విబేధాలు: నయనతార కెరీర్‌పై ప్రభావం?

Nayanthara Dhanush controversy

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యలో కాస్త దూకుడు తగ్గించిందని చెప్పొచ్చు. బాలీవుడ్ లో “జవాన్” సినిమా హిట్ అయినా, కోలీవుడ్ లో ఆమె సినిమాలు తగ్గిపోయాయి. అంతేకాదు, స్టార్ సినిమాలు కూడా చాలా తగ్గిపోయాయి, ఇంతకు ముందు, టాప్ స్టార్స్ ఆమెతో సినిమాలు చేస్తుండగా, ఇప్పుడు పరిస్థితి కొంత మారింది.

నయనతారకు అవకాశాలు తగ్గిపోవడాన్ని వెనక ధనుష్ తో ఉన్న గొడవ అని పలువురు భావిస్తున్నారు. నయనతార పెళ్లి డాక్యుమెంటరీపై ధనుష్ కేసు వేసిన సమయంలో ఆమె కూడా అదే రేంజ్ లో తిరిగి ఆఫెన్సివ్ అయింది. ఈ గొడవ కారణంగా ఆమె కెరీర్ పై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు, నయనతార, ధనుష్ కలిసి నటించడంతో ఎలాంటి గొడవలు లేకుండా సరైన సంబంధాలు ఉండేవి. కానీ, “నాన్ రౌడీ ధాన్” సినిమా క్లిప్ నయనతార తన డాక్యుమెంటరీలో వాడినప్పటి నుంచి, ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ప్రస్తుతం, ఇద్దరూ ఒకరికొకరు పలకరించకపోవడం చూస్తున్నాం

ఈ దూరం నయనతారకు కొన్ని అవకాశాలను మిస్ చేయించినట్లు తెలుస్తోంది. ధనుష్ తో ఈ డిస్టన్స్ పరిష్కారం ఎప్పుడవుతుందనేది చూడాలి. అయితే, నయనతార కెరీర్ స్పీడ్ తగ్గినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Read More

One thought on “ధనుష్ తో విబేధాలు: నయనతార కెరీర్‌పై ప్రభావం?

Comments are closed.