నిర్మాతగానూ సత్తా చాటుతున్న నాచురల్ స్టార్

Nani HIT3 movie

నేచుర‌ల్ స్టార్ నాని, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా సినిమాల్లో అడుగుపెట్టిన అనంతరం హీరోగా, నిర్మాతగా అద్భుతంగా కొనసాగుతున్నాడు. ఇండ‌స్ట్రీలో తన ప్ర‌యాణాన్ని వాల్‌పోస్ట‌ర్ సినిమాస్ బ్యాన‌ర్ ద్వారా ప్రారంభించి, కొత్త టాలెంట్స్‌ను ప్రోత్సాహిస్తూ, మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ బ్యాన‌ర్‌లో ఇప్పటివరకు వచ్చిన ప్రతీ సినిమా మంచి విజయాలను సాధించాయి.

తాజాగా, నాని నిర్మాతగా కోర్టు సినిమా రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు, తన బ్యానర్ నుండి “హిట్ 3” సినిమాను హీరోగా నటిస్తూ, నిర్మించడం ప్రారంభించనున్నారు. హిట్ ఫ్రాంచైజీకి చెందిన ఈ మూడో సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఆమె టాలీవుడ్‌లో ఈ సినిమాతో అడుగుపెడుతోంది.

హిట్3 చిత్రంలో నాని, సెట్స్‌లో నిర్మాతగా కాకుండా, తన పాత్రకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీనిధి శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నాని సెట్‌లో ఎప్పుడూ యాక్ట‌ర్‌గా ఉండి, అద్భుతంగా తన పాత్రపై ఫోకస్ చేస్తున్నాడని ఆమె చెప్పింది. “నాని మ్యాజిక్‌ను న‌మ్మే నిర్మాత,” అని శ్రిధిని ఈ సందర్భంగా పేర్కొంది.

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా, నాని తన అనుభవాలను పంచుకుంటూ, డైరెక్టర్ కు పూర్తి సహకారం అందిస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా తన అనుభవాన్ని ఉపయోగించి, ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్సులు వస్తే వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నానని నాని తెలిపారు. “నాతో కలిసి సినిమాలు చేయాలంటే ఓపిక ఉండాలి,” అంటూ హిట్3 ద్వారా తన అద్భుతమైన పనితీరును చూపిస్తున్నాడు.

Read More


One thought on “నిర్మాతగానూ సత్తా చాటుతున్న నాచురల్ స్టార్

Comments are closed.