నేచురల్ స్టార్ నాని తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా ద్వారా మరో వినూత్న కథను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రేమ, కోర్ట్ రూమ్ డ్రామా కలయికగా తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడి’ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రేమియర్ షోలు ఊహించని విధంగా భారీ స్పందనను పొందాయి. భారత్‌లోని థియేటర్లలో పూర్తిగా బుకింగ్స్ నమోదు కాగా, అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే $150Kకి పైగా వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోల ద్వారా రూ. 2 కోట్లకు చేరువై కలెక్షన్ రాబట్టింది.
భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా మంచి స్పందన దక్కించుకున్న ఈ చిత్రం, తొలి వీకెండ్‌లోనూ ఇదే జోరును కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది. టికెట్ బుకింగ్స్ వేగంగా పెరుగుతుండటంతో, ఈ చిత్రం థియేటర్లలో విజయవంతమైన రన్ సాధించే అవకాశం కనిపిస్తోంది.

One thought on “నేచురల్ స్టార్ నాని ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడి’ గ్రాండ్ రిలీజ్ – ప్రీమియర్ షోలు హౌస్‌ఫుల్!”
Comments are closed.