నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లాలో విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టానికి గురైనవారంతా ఓ కుటుంబానికి చెందినవారని అధికారులు వెల్లడించారు.

ప్రమాదానికి కారణం ఓవర్ స్పీడ్ లేదా వాహనం సాంకేతిక లోపమా అనే విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read More : భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం

One thought on “నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Comments are closed.