కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి.

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో ఘోరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారి నందినిని ఆమె స్వంత తల్లి ఎల్లమ్మ దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం – ఎల్లమ్మ అనే మహిళ గతంలోనే తన భర్తను హత్య చేసిన నిందితురాలిగా కేసు ఎదుర్కొంది. తాజాగా, మానవత్వాన్ని మంటగలిపేలా – తన ఏడేళ్ల కుమార్తె నందినిని గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహాన్ని గ్రామ శివారులో ఉన్న నీటి గుంటలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. గ్రామస్తులు ఈ విషాదకర సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Read More : వరంగల్ ఆర్మీ జవాన్ ఆత్మహత్య.

One thought on “కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి.

Comments are closed.