మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు

లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. కేసులో నిందితుడిగా ఉన్న మిథున్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆయన ఆరో నిందితుడిగా (A4) నమోదయ్యారు. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. నిన్న వెలువడిన తీర్పులో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేదని స్పష్టం చేసింది. దీంతో మిథున్ రెడ్డి దేశం విడిచిపోవద్దనే ఉద్దేశంతో, ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Read More : సీఎం – ఆర్థిక సహాయం, ప్రాజెక్టులపై చర్చ

One thought on “మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు

Comments are closed.