ఢిల్లీ వేదికగా ఆదివారం జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు ముంబయి ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు ఢిల్లీకి చేరుకున్న ముంబయి జట్టు, శనివారం ముమ్మరంగా ప్రాక్టీస్ నిర్వహించింది. అయితే ఈ ప్రాక్టీస్ సమయంలో హఠాత్తుగా వాతావరణం మారి మైదానాన్ని దుమ్ము కమ్మేసింది.
దుమ్ము మేఘాలు స్టేడియాన్ని ఆవరించడంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అప్రమత్తంగా స్పందించి, ప్రాక్టీస్ చేస్తున్న తన సహచర ఆటగాళ్లను వెంటనే మైదానం విడిచిపెట్టి బయటికి రావాలని గట్టిగా పిలిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోహిత్ శర్మ హెచ్చరికతో ముంబయి జట్టు సభ్యులు కోచ్ మాహేలా జయవర్ధనే, లసిత్ మలింగ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ తక్షణమే ప్రాక్టీస్ నిలిపి స్టేడియం బయటికి పరుగులు తీశారు.
ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అజేయంగా దూసుకుపోతుండగా, ముంబయి ఇండియన్స్ మాత్రం వరుస పరాజయాలతో వెనుకబడి పోయింది. ఇప్పటివరకు ఢిల్లీ నాలుగు మ్యాచ్‌లలో అన్ని గెలుపొందగా, ముంబయి ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకదానిలో మాత్రమే విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ జట్టుకు ఎంతో కీలకంగా మారింది. వరుస ఓటముల నుంచి బయటపడాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ముంబయి ఉంది. అభిమానులు ఈ మ్యాచ్‌పై ప్రత్యేక ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Read More : పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా గ్రీన్ జెర్సీలో RCB
