లండన్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఘనస్వాగతం!

megastar-chiranjeevi-honored-at-uk-house-of-commons

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని గుర్తించిన యూకే ప్రభుత్వం, లండన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆయనను సత్కరించనుంది.

మార్చి 19న చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నారు. ఈ ప్రత్యేక సందర్భం కోసం మెగాస్టార్ లండన్ చేరుకున్నారు. తమ హీరోకు అంతర్జాతీయ గౌరవం లభించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో వందలాది మంది ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. చిరంజీవి అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ, వారితో సరదాగా గడిపారు.

ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ చిత్రం జూన్‌లో షూటింగ్ ప్రారంభమై, సంక్రాంతికి విడుదల కానుంది.

అదే విధంగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి లభించిన ఈ గౌరవం, తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచింది!

Read More

One thought on “లండన్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఘనస్వాగతం!

Comments are closed.