మీరట్ పోలీసుల కథనం ప్రకారం, సౌరభ్ రాజ్‌పుత్ తన భార్య ముస్కాన్, సహిల్ మధ్య ఉన్న రహస్య సంబంధాన్ని 2021 నుంచే తెలుసుకున్నాడు. ఈ విషయంలో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన భార్య నమ్మకద్రోహం చేసినట్లు భావించిన సౌరభ్, విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే, కుటుంబ సభ్యులు మధ్యస్థతంగా వ్యవహరిస్తూ ఆయనను ఆ నిర్ణయం నుంచి వెనక్కు తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా, ముస్కాన్, సహిల్ కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నారు. ఫిబ్రవరి 25న సౌరభ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఈ దంపతులు తమ ప్రణాళికలో విఫలమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ముస్కాన్, సహిల్ పాత్రపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Read More : యూట్యూబ్ వీడియోలతో ఆపరేషన్.. గాయాలను కుట్టుకున్న వ్యక్తి.. చివరికి ఆసుపత్రి పాలైన ఘటన!

One thought on “భార్య అక్రమ సంబంధంపై భర్తకు 2021 నుంచే అనుమానం – హత్యాయత్నంతో కలకలం”
Comments are closed.