ఈ ఫ్యాన్సీ నెంబర్‌ విలువ ఏకంగా లక్షల్లో..

This fancy number is worth lakhs

కార్లు మరియు ఇతర ఇష్టమైన వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవాలని చాలా మంది ఆకాంక్షిస్తారు. ఎంత డబ్బయినా సరే పెట్టి ప్రత్యేకమైన నంబర్ దక్కించుకోవాలని కోరుకుంటారు. ఫ్యాన్సీ నంబర్లకు ఫిల్మ్ స్టార్లు, పెద్ద వ్యాపారవేత్తలు, కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. తమ వాహనాలకు ప్రత్యేక నంబర్లు ఉంటే, రీసేల్ సమయంలో మంచి ధర వస్తుందనే ఆలోచన కూడా కొందరిలో ఉంది.

ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మణికొండలో ఉన్న RTA Office కు ఒక్కరోజులోనే ₹37,29,690 ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం ఆదాయం ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా లభించింది. వీటిపై ఉన్న క్రేజ్ కారణంగా ప్రజలు నంబర్ల కోసం పోటీ పడుతూ ఉంటారు. సెంటిమెంట్, జాతకం, లక్కీ నంబర్స్ అనే నమ్మకంతో, తమకు అనుకూలమైన నంబర్లను పొందేందుకు లక్షల్లో ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదు.

శనివారం జరిగిన ఈ వేలంలో TG 07 P 9999 నెంబర్ అత్యధికంగా ₹9,86,999 కు అమ్ముడైంది. ఈ నెంబర్‌ను Mushp Project India Pvt Ltd అనే సంస్థ దక్కించుకుంది. అదే విధంగా, TG 07 R 0009 అనే నెంబర్ KLSR Infratech Ltd సంస్థ ₹7.50 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది.

ఇది మాత్రమే కాదు, మొత్తం 106 మంది ఈ వేలంలో పాల్గొన్నారు. కొంతమందికి ఫ్యాన్సీ నంబర్లు సెంటిమెంట్ అయితే, మరికొంత మంది తమ హోదా చాటుకోవడానికి వీటిని కొనుగోలు చేస్తున్నారు. కార్ల నెంబర్ ప్లేట్లే కాకుండా Fancy Mobile Numbers కోసం కూడా అధిక మొత్తంలో డబ్బు పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Read More

One thought on “ఈ ఫ్యాన్సీ నెంబర్‌ విలువ ఏకంగా లక్షల్లో..

Comments are closed.