మంచు విష్ణు ‘కన్నప్ప’ టీజర్ 2 విడుదల

kannappa

మంచు విష్ణు ‘కన్నప్ప’ – టీజర్ 2 విడుదల

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప‘ (Kannappa) విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్‌లాల్ (Mohanlal) వంటి అగ్రనటులు కీలక పాత్రలు పోషించగా, కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పార్వతీ దేవి పాత్రలో కనిపించనున్నారు. తిన్నడు పాత్రలో మంచు విష్ణు న‌ట‌న ఆకట్టుకుంటుంది.

చిత్రబృందం తాజాగా ‘కన్నప్ప’ టీజర్ 2 (Kannappa Teaser 2)ను విడుదల చేసింది. టీజర్‌లో అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీగా, ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ మేకింగ్‌తో ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.

ఈ పాన్‌ ఇండియా మూవీ ఏప్రిల్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Read More