మూడు గంటల నిడివితో, ఫైర్ క్లాన్ ప్రతినాయకులుగా!

avatar

ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron) తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘అవతార్: ఫైర్ అండ్ అష్’ (Avatar: Fire and Ash) గురించి ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఈ సినిమా సుమారు మూడు గంటల పాటు సాగనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, ఈసారి ప్రధాన ప్రతినాయకులుగా ఫైర్ క్లాన్ (Fire Clan) కనిపించనున్నారని వెల్లడించారు.

గత చిత్రాల్లో చూడని కొత్త జీవులతో పాటు, ఈసారి ప్రేక్షకులు వాయు వాణిజ్య దళం (Wind Traders) అనే ప్రత్యేక తెగను కూడా చూడబోతున్నారని కామెరాన్ తెలిపారు. ఈ తెగ గాల్లో ప్రయాణించే నోమాడిక్ గుంపుగా (Nomadic Tribe) ఉత్కంఠను రేకెత్తించనుందని చెప్పారు. ‘అవతార్’ ప్రపంచాన్ని మరో అద్భుత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈ కథ ఉండబోతుందని, ప్రేక్షకులకు విస్మయకరమైన విజువల్ అనుభూతిని అందించేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

Read More