తావి నదిలో చిక్కుకున్న వ్యక్తి

జమ్మూలోని తావి నదిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ నదిలో చిక్కుకుపోయాడు. వరద ప్రవాహం మధ్యలో వంతెన వద్ద ఉన్న కేబుల్‌ను పట్టుకుని అతడు సాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న దృశ్యం హృదయాన్ని కలిచివేస్తోంది.

ప్రస్తుతం ఆ వ్యక్తి జీవితానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉండగా, స్థానికులు మరియు కొందరు ప్రయాణికులు అతన్ని కాపాడేందుకు యత్నిస్తున్నారు. అయితే వరద వేగం అధికంగా ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం ఘటన స్థలానికి చేరుకుంటూ సహాయక చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.వర్షాలతో వరదల ముప్పు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తావి నది ఒడ్డుల్లో నివాసమున్నవారు, ప్రయాణీకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Read More : తమిళనాడులో దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం