కేసీఆర్ నిర్ణయం సమర్థించిన మల్లారెడ్డి.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న కవిత సస్పెన్షన్‌ నిర్ణయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సమర్థించారు. పార్టీ క్రమశిక్షణ విషయానికి వస్తే కేసీఆర్ ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తారని, ఈ నిర్ణయం మరోసారి ఆ విషయాన్ని నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించారు.

బోయిన్‌పల్లిలో జరిగిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి, “ప్రతి కుటుంబంలో విభేదాలు సహజం. అలాగే ప్రతి రాజకీయ పార్టీలో ఇలాంటి సస్పెన్షన్లు జరుగుతుంటాయి. కేసీఆర్‌కు కుటుంబం కంటే పార్టీ, ప్రజల శ్రేయస్సే ముఖ్యమైనవి. ఆయన తన కుటుంబం కోసం పార్టీని దెబ్బతీయరని అందరికీ తెలిసిన విషయమే” అన్నారు.

అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ కేవలం డ్రామా చేస్తోంది. సీబీఐ అయినా, ఎవరు విచారణ చేసినా ఏమీ రాదని స్పష్టం చేశారు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు తెలంగాణకు దొరకడం ప్రజల అదృష్టం” అని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు.

Read More : దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు పొడిగింపు.

One thought on “కేసీఆర్ నిర్ణయం సమర్థించిన మల్లారెడ్డి.

Comments are closed.