లాస్ వెగాస్ ఎయిర్‌పోర్టులో విమాన దుర్గటన తప్పింది?

అమెరికాలోని లాస్ వెగాస్ ఎయిర్‌పోర్టులో ఓ ఘోర ప్రమాదం క్షణాల్లో తప్పించుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీనితో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఇదంతా గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించాడు. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌ను అమలు చేసి విమానాన్ని తిరిగి లాస్ వెగాస్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేయించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగలేదు. వారు అంతా క్షేమంగా బయటపడ్డారు.

ఈ సంఘటనకు సంబంధించి విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన సాంకేతిక లోపాలపై విమానయాన శాఖ దృష్టి సారించింది. ఇంజిన్‌లో మంటలు ఎలా చెలరేగినాయన్నదానిపై పూర్తి సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రయాణికుల భద్రతను ముందుండి కాపాడిన పైలట్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విమాన ప్రయాణాలపై భద్రతా చర్యలు మరింత బలపర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More : ఇరాన్‌పై ట్రంప్ ఘాటు హెచ్చరికలు

One thought on “లాస్ వెగాస్ ఎయిర్‌పోర్టులో విమాన దుర్గటన తప్పింది?

Comments are closed.