కింగ్ కోబ్రాను పట్టిన లేడీ ఆఫీసర్

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేసిన ఓ భారీ నాగుపాము – 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా – స్థానికుల ఇళ్లకు సమీపంలో ఉన్న వాగులో ప్రత్యక్షమైంది. వెంటనే అప్రమత్తమైన ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ రోషిణి, తక్కువ సమయంలోనే పూర్తి చాకచక్యంగా, ఆ కోబ్రాను భద్రంగా పట్టుకుని జనభాగం నుంచి తరలించారు. పామును గమనించినా భయపడకుండా, అత్యంత నిపుణతతో స్పందించిన ఆమె తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ అరుదైన సాహసానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.