నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న సమయంలో షటిల్‌కాక్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో, దాన్ని తీసే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై ఒక బాలుడు మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే..
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత్‌నగర్‌లో 14 ఏళ్ల బాలుడు తన బంధువుతో కలిసి ఇంటి ప్రాంగణంలో బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో షటిల్‌కాక్ పక్కనే ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దాన్ని బ్యాట్‌తో తీయడానికి ప్రయత్నించగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Read More : ‘విపక్షాల గొంతు నొక్కేందుకే అరెస్ట్‌లు’

One thought on “షటిల్‌కాక్ తీసే ప్రయత్నంలో బాలుడు మృతి”
Comments are closed.