వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. సభ ప్రాంగణాన్ని సందర్శించి, నిర్వహణపై అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభ సజావుగా కొనసాగేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. “సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 2000 మందిని వాలంటీర్లుగా నియమించాం. భద్రతా దళాలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి” అని కేటీఆర్ తెలిపారు.
ఇక పహల్గాం ఉగ్రదాడిలో అమాయకంగా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కేటీఆర్ సభ ప్రాంగణంలో మౌనం పాటించి, హృదయపూర్వక నివాళులర్పించారు. “దేశ భద్రతకు అంతరాయం కలిగించే శక్తులను సహించరాదని” ఆయన హితవు పలికారు.
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని ప్రజల కష్టాలు, ఆశయాలపై దృష్టి పెట్టే వేదికగా మలచాలని కేటీఆర్ పేర్కొన్నారు.
Read More : హైడ్రా కొత్త లోగో విడుదల
