గుజరాత్ వంతెన కూలిన ఘటనపై కేటీఆర్ ఘాటు విమర్శలు

ktr

గుజరాత్‌లో మరో వంతెన కుప్పకూలిన దుర్ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బుధవారం గుజరాత్‌లోని పద్రా సమీపంలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కేటీఆర్, ఇది బీజేపీ ప్రచారం చేసే ‘డబుల్ ఇంజిన్ గుజరాత్ మోడల్‌’కు మరో శోచనీయ ఉదాహరణగా పేర్కొన్నారు. ఇదివరకు మోర్బీ వంతెన కూలిన సమయంలో 140 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనను గుర్తు చేసిన ఆయన, “గుజరాత్, బీహార్‌లలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని చెప్పుకుంటూ తరచూ వంతెనలు కూలిపోవడమేంటి?” అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎన్డీఎస్‌ఏ లేదా ఇతర స్వతంత్ర సంస్థలతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.

దుర్ఘటన సమయంలో వంతెనపై ఉన్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. సహాయక బృందాలు వెంటనే స్పందించి పలువురిని రక్షించాయి. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read More : కేంద్రంపై కవిత మండిపాటు

One thought on “గుజరాత్ వంతెన కూలిన ఘటనపై కేటీఆర్ ఘాటు విమర్శలు

Comments are closed.