“అవ్వా.. బాగున్నావా?” – కేటీఆర్ అప్యాయతకు నెటిజన్ల ప్రశంసలు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సాదాసీదా ప్రవర్తనతో మరోసారి అందరి మన్ననలు పొందారు. నగరంలోని ఓల్డుబోయినపల్లి డివిజన్లో ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వచ్చిన కేటీఆర్ స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.

వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన కేటీఆర్
విందు సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ తల్లిని కేటీఆర్ ఆలింగనం చేసుకుని, “అవ్వా.. బాగున్నావా? ముద్దం అన్న నిన్ను బాగా చూసుకుంటున్నాడా? లేకుంటే చెప్పు, మా ఇంటికి తీసుకెళ్తా” అంటూ సరదాగా ముచ్చటించారు.

ఈ మధురమైన సంఘటనను అక్కడున్న వారంతా ఆసక్తిగా వీక్షించారు. అనంతరం కేటీఆర్ కుటుంబ సభ్యులతో 20 నిమిషాల పాటు గడిపారు. వారితో సెల్ఫీలు దిగుతూ, ఫొటోలు తీయించుకున్నారు. అతిథ్యాన్ని స్వీకరించి, తనకు ఇష్టమైన కాఫీ పెట్టించుకుని తాగారు.

కేటీఆర్ వీడియో వైరల్
ఈ ముచ్చటైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేటీఆర్ తన అందమైన వృద్దురాలితో చేసిన ఆప్యాయత నెటిజన్లను ఆకర్షించింది. రాజకీయాలను మరిచి, తన మానవత్వంతో పలువురిని మెప్పించిన కేటీఆర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.