భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక మహిళ, ప్రియుడి మోజులో పడి అతడిని దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహపురం గ్రామంలో చోటుచేసుకుంది.
సంఘటన వివరాలు:
గత 15 సంవత్సరాల క్రితం లక్ష్మణ్, పావని ప్రేమించుకుని, కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో, పావనికి సమీప బంధువైన ప్రదీప్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ విషయం భర్త లక్ష్మణ్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ప్రియుడితో ఉన్న సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనుకున్న పావని, ఈనెల 13న తన ప్రియుడు ప్రదీప్‌తో కలిసి లక్ష్మణ్‌ను హత్య చేసింది. బంధువులకు ఏమీ చెప్పకుండా హడావిడిగా అంత్యక్రియలు కూడా నిర్వహించింది.
పోలీసుల విచారణ:
అయితే, ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా, పావని తన ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు అంగీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి, పావనితో పాటు ఆమె ప్రియుడు ప్రదీప్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Read More : రాజమండ్రి పర్యటన వాయిదా – చంద్రబాబు, పవన్‌పై బొత్స ఫైర్

One thought on “కృష్ణా జిల్లాలో భార్యతోడు ప్రియుడు భర్త హత్య”
Comments are closed.