ప్రయాణికులెవరికీ ప్రమాదం లేదు

indigo

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ముంబైకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో విమానాశ్రయం పరిసరాల్లో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబైకి బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో 195 మంది ప్రయాణికులు ఇప్పటికే చెక్-ఇన్ పూర్తి చేసుకున్నారు. అయితే అదే సమయంలో వచ్చిన బెదిరింపు ఫోన్‌కాల్‌ టేకాఫ్‌కు ముందు అందడంతో వెంటనే భద్రతా బలగాలు చురుగ్గా స్పందించాయి.

ప్రయాణికులు, వారి లగేజీని విమానం నుంచి కిందకు దించి, విమానాన్ని ‘ఐసోలేషన్ బే’కి తరలించారు. బాంబు నిర్వీర్య బృందాలు, భద్రతా సిబ్బంది ప్రతి కోణాన్ని శోధించారు. చివరికి విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది బూటకపు బెదిరింపు అని తేలింది.

ఈ నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్ బలగాలు హై అలర్ట్ ప్రకటించి, విమానాశ్రయం చుట్టూ భద్రతను మరింత కఠినతరం చేశాయి. అధికారుల స్పందన వేగవంతంగా ఉండటంతో ప్రయాణికులెవరూ గాయపడకుండా తప్పించుకున్నారు.

Read More : APPLES : భారత వ్యాపారుల నిర్ణయం

One thought on “ప్రయాణికులెవరికీ ప్రమాదం లేదు

Comments are closed.