ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025 న్యూయార్క్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సినీ తారలు ఫ్యాషన్ గౌన్లలో మెరిశారు. ఈవెంట్‌కు బాలీవుడ్-టాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన డ్రెస్‌లో కియారా అద్వానీ మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌తో కనిపించడంతో ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత ఇదే మొదటి సారి ఆమె పబ్లిక్‌గా కనిపించడం విశేషం.
‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కియారా. బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె వివాహం జరిపిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సమయంలోనే ప్రెగ్నెన్సీ న్యూస్ షేర్ చేశారు.
గేమ్ ఛేంజర్ తర్వాత కియారా మీడియా, ఈవెంట్‌లకు దూరంగా ఉన్నారు. తాజాగా మెట్ గాలా ఈవెంట్‌లో ప్రెజెన్స్‌తో మళ్లీ వార్తల్లో నిలిచారు. బేబీ బంప్‌తో కనిపించి అందరినీ ఆకట్టుకున్న కియారా.. త్వరలోనే తల్లిగా మారనున్నట్లు పరోక్షంగా స్పష్టం చేసింది.
One thought on “బేబీ బంప్‌తో మెట్ గాలా వేడుకలో మెరిసిన కియారా అద్వానీ!”
Comments are closed.