ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం శనివారం.

ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 1.30 గంటలలోపు విగ్రహ నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌కుమార్ తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం అర్థరాత్రి 12 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి గణపతి మండపం వద్ద షెడ్డు తొలగింపు పనులు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి 12 గంటల తర్వాత విగ్రహాన్ని ట్రాలీపై ఎక్కించి వెల్డింగ్ పనులు పూర్తి చేస్తారు.

శోభాయాత్ర సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ఠ బందోబస్తు కల్పిస్తున్నామని, భక్తుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Read More : ఖైరతాబాద్ బడా గణేశుడి చిరు రూపం: 5.5 సెం.మీ. పరిమాణంలో చాక్‌పీస్ శిల్పం