శ్రావణ మాసంలో నాన్‌వెజ్ విక్రయంపై ఆగ్రహం

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఇందిరాపురంలో ఉన్న ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ KFCపై హిందూ రక్షా దళ్ సభ్యులు దాడి చేశారు. శ్రావణ మాసం పర్వదినాల్లోనూ నాన్‌వెజ్ ఆహారాన్ని విక్రయిస్తున్నారని ఆగ్రహించిన హిందూ రక్షా దళ్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దుకాణంలోకి ప్రవేశించిన వారు నాన్‌వెజ్ అమ్మకాలను నిరసిస్తూ నినాదాలు చేసారు. ఆ తర్వాత షాపును బలవంతంగా మూసివేశారు. ఈ ఘటనతో కొంత కాలం పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఘటనపై స్థానిక పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. శ్రావణ మాసం వంటి పవిత్రకాలంలో మాంసాహార విక్రయంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలో ఈ ఘటన సంచలనం రేపుతోంది.

Read More : పక్షుల, జంతువుల తాకిడులతో ఎలెర్ట్ లో ఏవియేషన్ రంగం

One thought on “శ్రావణ మాసంలో నాన్‌వెజ్ విక్రయంపై ఆగ్రహం

Comments are closed.