పూర్తిగా ఫెయిల్ అయిన కేతిక శ‌ర్మ కెరీర్: ‘సింగిల్’ సినిమాతో ఎదురుచూపులు

Ketika Sharma career struggles

ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన నాలుగేళ్ల‌లో కేతిక శ‌ర్మకు కేవ‌లం డిజాస్ట‌ర్స్ మాత్ర‌మే ద‌క్కాయి. పూరీ జ‌గ‌న్నాధ్ కొడుకు పూరీ ఆకాష్ హీరోగా న‌టించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన కేతిక, ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో పెద్ద హైప్ తెచ్చుకోలేక‌పోయింది. నాలుగేళ్లుగా సినిమాలు చేసినా, ఆమెకు ఒక సాలిడ్ హిట్ లభించలేదు. ఈ పరిస్థుతులు చూస్తుంటే, కేతిక ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన టైమ్ క‌రెక్ట్ కాద‌నిపిస్తోంది.

కేతిక శ‌ర్మ న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ఆమె నటించిన రొమాంటిక్ సినిమాల‌తో పాటు, నాగ శౌర్యతో చేసిన “ల‌క్ష్య” మరియు వైష్ణవ్ తేజ్ తో చేసిన “రంగ రంగ వైభవంగా” కూడా మంచి స్పందన అందుకోలేదు. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద విఫలమయ్యాయి, దీంతో ఆమె కెరీర్‌కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత రాబిన్‌హుడ్ సినిమా లో ఐటెమ్ సాంగ్ చేయ‌డంతో కొంత గ్యాప్ మ‌ధ్య, ఆ సాంగ్ కూడా కేతిక‌కు ఆశించిన స‌క్సెస్‌ను ఇవ్వ‌లేక‌పోయింది.

ప్రస్తుతం కేతిక శ‌ర్మ చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా “సింగిల్”. శ్రీవిష్ణు హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా పై ఆమె బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆమెకు మరో విజయాన్ని తీసుకువస్తే, తదుపరి సినిమాల అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆమె ఆశిస్తోంది. “సింగిల్” సినిమా ఈ ఆశలను ఎంతవరకు సాకారం చేస్తుందో చూడాలి.

Read More




One thought on “పూర్తిగా ఫెయిల్ అయిన కేతిక శ‌ర్మ కెరీర్: ‘సింగిల్’ సినిమాతో ఎదురుచూపులు

Comments are closed.