బీఆర్ఎస్ నేత కవిత మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురిగా పుట్టడం తన సుకృతమని, తన తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో అడుగుపెట్టానని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ నుంచే ‘సామాజిక తెలంగాణ’ అర్థం చేసుకున్నానని తెలిపారు. తన కుమారుడు పసివాడిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. ఇటీవల తాను ప్రస్తావించిన ఇద్దరు నేతలు తనపై దుష్ప్రచారం చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నా, ప్రచార యుద్ధం జరుగుతున్నా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఒక చెల్లెలుగా ఆయనను కోరినా కూడా స్పందించలేదు. 103 రోజులుగా నా మీద టార్గెట్ జరుగుతుంటే, మీరు ఒక్కసారి కూడా అడగరా?” అని ప్రశ్నించారు.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నిన్న బీఆర్ఎస్ ప్రకటించిందని కవిత తెలిపారు. తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నానని గుర్తు చేశారు. “గులాబీ కండువా కప్పుకుని ప్రజా సమస్యల కోసం పోరాడటం పార్టీ వ్యతిరేకతా?” అని ప్రశ్నించారు. తమలాగా తనకు పార్టీలో కోవర్టులు లేరని స్పష్టం చేశారు.
Read More : కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ?
One thought on “కవిత సస్పెన్షన్‌పై ఆవేదన.”
Comments are closed.