కన్నడ నటి రన్యా రావు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సీబీఐ ఈ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేసింది. అక్రమ బంగారం సరఫరా నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) బృందాలు కూడా వేగం పెంచాయి. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేయడంలో నటి రన్యా రావు ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బెంగళూరు, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో సీబీఐ, డీఆర్ఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.
విమానాశ్రయ సిబ్బంది, ట్రావెల్ ఏజెంట్లు, కస్టమ్స్ అధికారులు, స్థానిక పోలీసుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది అనుమానితులను విచారించిన అధికారులు, బంగారం స్మగ్లింగ్ వెనుక ఉన్న ముఠాను పట్టుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. నటి రన్యా రావు ఇటీవల సందర్శించిన బంగారు దుకాణాల సమాచారం సేకరించడంతో పాటు, ఢిల్లీ లింక్‌పై దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.
రన్యా రావు కంపెనీ జిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తుమకూరు సమీపంలోని షిరాలో ఉంది. బీజేపీ ప్రభుత్వం హయాంలో 2023లో ఈ కంపెనీకి KIADB ద్వారా 12 ఎకరాల భూమి కేటాయించబడింది. 138 కోట్ల మూలధనంతో కంపెనీ ప్రారంభమైందని, 160 మందికి ఉపాధి కల్పించానని రన్యా పేర్కొన్నా, ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత వారం రోజుల్లోనే మూడు విమానాశ్రయాల్లో భారీగా బంగారం అక్రమ రవాణా వెలుగుచూడటంతో, ఈ కేసు మరింత కీలకంగా మారింది.

One thought on “బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావు.. రోజుకో కొత్త ట్విస్ట్!”
Comments are closed.