“మేడం గారు నిజాలు చెప్పండి” – కంగనాకు అధికారుల గట్టి సమాధానం

Kangana Ranaut electricity bill issue

బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కింది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని తన నివాసానికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని ఆరోపించిన కంగనా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడికి ప్రత్యక్ష ఉదాహరణ అంటూ రాజకీయ వేదికపై తీవ్ర విమర్శలు చేసింది. తాను నివసించని ఇంటికి ఈ స్థాయి బిల్లు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించడంతో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఈ వివాదం రాజకీయ దుమారం రేపింది. బీజేపీ నేతలు ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలుగా మలిచారు. దీంతో ప్రభుత్వం స్పందిస్తూ విద్యుత్ శాఖ అధికారులను వెంటనే విచారించింది. అసలు విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్, కంగనా ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. ఆమె ఇంటికి వచ్చిన బిల్లు వివరాలు తూచగా వెల్లడించారు.

అధికారుల ప్రకారం, కంగనా ఇంటికి ఈ నెల ₹55 వేలు కరెంట్ బిల్లు వచ్చినా, గత బకాయిలతో కలిపి ₹91 వేలుగా మారిందని తెలిపారు. ఎంపీ గారు నవంబర్, డిసెంబర్ బిల్లులు మాత్రమే చెల్లించారని, జనవరి, ఫిబ్రవరి బిల్లులు బకాయిగా ఉన్నాయని వివరించారు. పాత బకాయిలు లేకపోయినా, ఈ స్థాయిలో బిల్లు రాదు అన్నారు. ఇంకా, ప్రభుత్వం నుంచి ₹700 సబ్సిడీ సైతం అందిందని ఆయన స్పష్టం చేశారు.

ఈ వివాదంపై మంత్రి విక్రమాదిత్య సింగ్ కూడా స్పందించారు. కంగనా అబద్ధాలను ప్రజా వేదికలపై ప్రసారం చేయడం తగదన్నారు. బిల్లు చెల్లించకపోయి ప్రభుత్వంపై దూషణలు చేయడం సరైంది కాదని కౌంటర్ ఇచ్చారు. అధికారుల వివరణతో బీజేపీ నేతలు సైతం మౌనం వహించగా, ఇప్పుడు కంగనా ఈ వివరణపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Read More




One thought on ““మేడం గారు నిజాలు చెప్పండి” – కంగనాకు అధికారుల గట్టి సమాధానం

Comments are closed.