తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ భూములకు సంబంధించి కొన్ని ఫేక్ వీడియోలు, ఏఐ ఆధారిత ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాపించటంతో ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా గంభీరంగా తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ముసలం చేసేందుకు కావాలనే ఫేక్ పోస్ట్‌లు చేసిన వారిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఫేక్ వీడియోలు, ఏఐ ఫేక్ ఫోటోలు పోస్టు చేసిన పలువురిని పోలీసులు గుర్తించారు. ఫేక్ పోస్టులపై నిఘా పెట్టిన తర్వాత పలువురు సెలబ్రిటీలు వాటిని డిలీట్ చేసినట్లు సమాచారం.
మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 2 మధ్య కాలంలో ఫేక్ పోస్టులు చేసిన వారి వివరాలను పోలీసులు సేకరించారు. వారి సోషల్ మీడియా ఖాతాల URLతో పాటు మరిన్ని ఆధారాలను కూడగట్టారు.
ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలు పోస్టులు తొలగించినట్లు గుర్తించిన పోలీసులు, ఇంకా పోస్టులు తొలగించని వారందరికీ నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని సమాచారం.
Read More : దుబాయ్‌లో తెలుగు వాసులపై దారుణ హత్య — ఆలస్యంగా వెలుగులోకి సంఘటన

2 thoughts on “కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై పోలీసుల సీరియస్ దర్యాప్తు”
Comments are closed.