ప్రధాని మోదీని కలిసిన కమల్ హాసన్

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా తమిళనాడులోని చారిత్రక కీళడి తవ్వకాల గురించి చర్చించినట్లు కమల్ హాసన్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా తెలిపారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ పోస్ట్ చేస్తూ, “తమిళ నాగరికత గొప్పతనాన్ని, తమిళ భాష వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మద్దతు అందించాలని ప్రధానిని కోరాను” అని పేర్కొన్నారు. కీళడి తవ్వకాల ద్వారా బయటపడిన ప్రాచీన నాగరికత విశేషాలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దృష్టి సారించాలని ఆయన ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది.

One thought on “ప్రధాని మోదీని కలిసిన కమల్ హాసన్

Comments are closed.