కల్యాణ్ రామ్ ‘అర్జున్ S/O వైజయంతి’ ప్రీ-టీజర్ విడుదల

Arjun S/O Vyjayanthi

నందమూరి కల్యాణ్ రామ్ తన అత్యంత తీవ్రమైన పాత్రలో కనిపించనున్న ‘అర్జున్ S/O వైజయంతి’ చిత్ర ప్రమోషన్లు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కల్యాణ్ రామ్, విజయశాంతి పవర్ఫుల్ లుక్స్‌లో కనిపించారు. దీనివల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి.

తాజాగా మేకర్స్ ప్రీ-టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో కల్యాణ్ రామ్ రక్తపు మరకలతో ఉన్న షర్ట్ ధరించి, ముఖానికి మాస్క్ వేసుకుని, సముద్ర తీరాన ఉన్న ఓ పడవపై కూర్చొని కనిపించాడు. సముద్రం వైపు నుంచి పడవలు అతనివైపుగా వస్తుండటంతో, తీవ్రమైన పోరాటం జరగబోతోందని సూచిస్తున్నాయి. ఈ దృశ్యాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. టీజర్ మార్చి 17న రానుంది.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బాలుసు నిర్మిస్తున్నారు. సినిమాలో సాయీ మంజ్రేకర్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ప్రతినాయకుడిగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

ఇప్పటికే సినిమాపై మంచి బజ్ నెలకొనగా, టీజర్ విడుదలతో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Read More

One thought on “కల్యాణ్ రామ్ ‘అర్జున్ S/O వైజయంతి’ ప్రీ-టీజర్ విడుదల

Comments are closed.