సినీనటి కల్పికా గణేష్‌పై మరోసారి కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 67 ఐటీఏ 2000-2008, 79, 356 BNS సెక్షన్ల ప్రకారం తాజా కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన పదజాలంతో దూషించినట్లు బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేసింది. ఆన్లైన్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
కేవలం సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టడం మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపి దారుణంగా మాట్లాడిందని కీర్తన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్‌బాక్స్‌లో వచ్చిన మెసేజ్‌లు, స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లను ఆధారాలుగా సమర్పించినట్టు సమాచారం. ఈ ఆధారాల ఆధారంగా పోలీసులు రెండోసారి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇప్పటికే కల్పికా గణేష్‌పై ఉన్న ఆరోపణలకు తోడు, తాజా కేసు సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును తీవ్రంగా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.
Read More : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్‌కు 3 కోట్ల ఆర్థిక సహాయం
