జపాన్ బ్యూటీ ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకుంది – వైరల్ వీడియో

Japanese Fan Learns Telugu for NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన తాజా చిత్రం దేవర ప్రమోషన్‌లో భాగంగా జపాన్‌కు పర్యటించారు. ప్రతిసారి జపాన్‌కి వెళ్లినప్పుడూ అందమైన జ్ఞాపకాలు సొంతం చేసుకుంటున్న తారక్, ఈసారి మరింత ప్రత్యేకమైన అనుభవాన్ని పొందారు.

తాజాగా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఒక ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తీసుకుంది. “జపాన్‌ వెళ్లిన ప్రతీసారి నాకు అందమైన జ్ఞాపకాలు లభిస్తాయి. కానీ ఈసారి కొంచెం విభిన్నంగా, ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్న ఒక అభిమాని గురించి వినడం నాకెంతో ఆనందం ఇచ్చింది” అంటూ తారక్ పేర్కొన్నారు.

సినిమా, భాషా ప్రేమికుడిగా సంస్కృతుల మధ్య వారధిగా నిలిచే సినిమాలు, భాషను నేర్పించగల సమర్థత కలిగివుంటే, అది నిజంగా చిరస్మరణీయమైన విషయం అని తారక్ అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన తారక్‌కి జపాన్‌ ట్రిప్‌ను మరింత ప్రత్యేకంగా మార్చింది.

జపాన్‌లో తారక్‌కి ఉన్న అభిమాన జనమంతా తెలిసిన విషయమే. కానీ ఈ స్థాయిలో అభిమానాన్ని చాటుకోవడం నిజంగా ఆకట్టుకునే విషయమే. గతంలో తారక్ లండన్ పర్యటన సమయంలో కూడా ఓ జపాన్ అభిమాని ఎన్టీఆర్‌ను కలుసుకునేందుకు ప్రత్యేకంగా లండన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె తారక్‌ను మళ్లీ జపాన్‌కు రావాలని ఆహ్వానించారు.

ప్రస్తుతం దేవర సినిమా జపాన్ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సినిమాకు అక్కడ మంచి స్పందన లభించింది. ఇప్పుడిది తారక్‌కి నిజంగా గర్వకారణం. తనపై చూపుతున్న అభిమానంతో తెలుగు నేర్చుకోవడం మాటల్లో చెప్పలేనంత ప్రేమగా చెప్పాలి.

ఇకపోతే, తారక్ బాలీవుడ్‌లో వార్ 2 చిత్రంలో నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

Read More