జాన్వీ కపూర్ పుట్టినరోజు స్పెషల్: దేవర పార్ట్ 2 నుంచి కొత్త పోస్టర్ విడుదల!

జాన్వీ కపూర్ పుట్టినరోజు స్పెషల్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన 28వ పుట్టినరోజును మార్చి 6 జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి మేకర్స్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో, దేవర పార్ట్ 2 నుండి తాజా “తంగం” పోస్టర్‌ను విడుదల చేసి, జాన్వీని ప్రత్యేకంగా అభినందించారు.

గత ఏడాది ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిగా కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం దేవర సినిమా పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా, జాన్వీకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ, దేవర మూవీ టీమ్ “తంగం” పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ పోస్టర్లో జాన్వీ కపూర్ భుజాన చేపలను తగిలించుకుని, నోటితో కత్తిని పట్టుకుని, ఆకట్టుకునే లుక్‌లో కనిపించింది. ఆమె కళ్లతో కుర్రాళ్లను ఆకర్షించే విధానం నెటిజన్లలో క్రేజీ రియాక్షన్స్ తెచ్చుకుంది.

Read More

One thought on “జాన్వీ కపూర్ పుట్టినరోజు స్పెషల్: దేవర పార్ట్ 2 నుంచి కొత్త పోస్టర్ విడుదల!

Comments are closed.