రప్పా.. రప్పా వ్యాఖ్యలపై మరోసారి వైఎస్ జగన్

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రప్పా.. రప్పా నరుకుతామంటూ వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేయడం, పోస్టర్లు ప్రదర్శించడంపై మరోసారి స్పందించారు. సినిమాలోని డైలాగునే మా వాళ్లు పోస్టర్లుగా ప్రదర్శించారన్నారు. ఇదేమైనా తప్పా అంటూ వెనుకేసుకొచ్చారు. ఆ డైలాగులు నచ్చకపోతే సినిమాలోనూ తీసేయించండి.. సెన్సార్ బోర్డు ద్వారా ఎందుకు అనుమతించారని ఎదురుదాడికి దిగారు. బాలకృష్ణ,పవన్ కల్యాణ్ సినిమాల్లో డైలాగ్ లు ఇంతకంటే దారుణంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. సినిమా డైలాగ్ పోస్టర్ ప్రదర్శించినందుకు 131 మందికి నోటీసులు ఇచ్చి, ఇద్దరిని రిమాండ్ కు పంపారని పేర్కొన్నారు. తన పర్యటనలకు ప్రభుత్వం అనుమతివ్వకపోగా మా నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ అన్నారు. పేర్లు రాసి, తదితరులు అని రాయడం.. వాళ్లకు గిట్టని వాళ్ళ పేర్లను అందులో ఇరికించడం చేస్తున్నారని అన్నారు.

Read More : చంద్రబాబును హెచ్చరించిన మాజీ సీఎం